Pages

Monday, February 18, 2013

Anandam - Kanulu Terichina


Artist: Aakash, Rekha Vedavyas
Year: 2001
Singers: Mallikarjun, Sumangali
Music Director: Devi Sri Prasad
Lyricist: Sirivennela Seetharama Shastry




kanulu terichina kanulu moosina kalalu aagavela
nijamu telisina kalani cheppina manasu nammadela
edute epudu tirige velugaa
idigo ipude choosaa sarigaa
innallu nenunnadi nadireyi niduralona
aite naakeenaade toli poddu jaada telisinda kottaga

kanulu terichina kanulu moosina kalalu aagavela
nijamu telisina kalani cheppina manasu nammadela

pedavullo ee darahaasam neekosam poosindi
nee jatalo ee santosham panchaalanipistondi
endukano madi neekosam aaraatam padutondi
ayitenem aa alajadilo oka aanandam vundi
dooram maha cheddadani ee lokam anukuntundi
kaani aa doorame ninnu daggara chesindi
neelo naa praanam undani ipudega telisindi
neeto adi cheppinda nee jnaapakaale naa oopirainavani

kanulu terichina kanulu moosina kalalu aagavela
nijamu telisina kalani cheppina manasu nammadela

prati nimisham naa talapanta nee chuttu tirigindi
evaraina kanipedataarani kangaaruga untondi
naa hrudayam nee oohalato tega urakalu vestondi
naakkoodaa ee kalavramipude parichayamayyindi
addamlo naa badulu are nuvve kanipinchaave
nene ika lenattu neelo kariginchaave
premaa ee kotta swaram ani anumaanam kaligindi
nuvve naa sandehaaniki vechchanaina rujuviyyamandi mari

kanulu terichina kanulu moosina kalalu aagavela
nijamu telisina kalani cheppina manasu nammadela
edute epudu tirige velugaa
idigo ipude choosaa sarigaa
innallu nenunnadi nadireyi niduralona
aite naakeenaade toli poddu jaada telisinda kottaga

కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేల
నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేల
ఎదుటె ఎపుడు తిరిగే వెలుగా
ఇదిగొ ఇపుడె చూసా సరిగా
ఇన్నాళ్ళు నేనున్నది నడిరేయి నిదురలోన
ఐతే నాకీనాడె తొలి పొద్దు జాడ తెలిసింద కొత్తగ

కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేల
నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేల

పెదవుల్లొ ఈ దరహాసం నీకోసం పూసింది
నీ జతలొ ఈ సంతోషం పంచాలనిపిస్తోంది
ఎందుకనొ మది నీకోసం ఆరాటం పడుతోంది
అయితేనేం ఆ అలజడిలొ ఒక ఆనందం ఉంది
దూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది
కాని ఆ దూరమె నిన్ను దగ్గర చేసింది
నీలొ నా ప్రాణం ఉందని ఇపుడేగ తెలిసింది
నీతొ అది చెప్పింద నీ జ్ఞాపకాలె నా ఊపిరైనవని

కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేల
నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేల

ప్రతి నిమిషం నా తలపంత నీ చుట్టూ తిరిగింది
ఎవరైన కనిపెడతారని కంగారుగ ఉంటోంది
నా హృదయం నీ ఊహలతొ తెగ ఉరకలు వేస్తోంది
నాక్కూడా ఈ కలవరమిపుడె పరిచయమయ్యింది
అద్దంలొ నా బదులు అరె నువ్వే కనిపించావె
నేనే ఇక లెనట్టు నీలొ కరిగించావే
ప్రేమా ఈ కొత్త స్వరం అని అనుమానం కలిగింది
నువ్వే నా సందేహానికి వెచ్చనైన రుజువియ్యమంది మరి

కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేల
నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేల
ఎదుటె ఎపుడు తిరిగే వెలుగా
ఇదిగొ ఇపుడె చూసా సరిగా
ఇన్నాళ్ళు నేనున్నది నడిరేయి నిదురలోన
ఐతే నాకీనాడె తొలి పొద్దు జాడ తెలిసింద కొత్తగ

0 comments:

Post a Comment