Pages

Tuesday, April 24, 2012

Varudu - Aidurojula Pelli


Artist: Allu Arjun, Bhanu Sri Mehra
Year: 2010
Singers: Jamuna Rani, Hemachandra, Malavika, Vijayalakshmi, Sunanda, Ranjith
Music Director: Mani Sharma
Lyricist: Veturi Sundararama Murthy




aidurojula pelli ammanti pelli tolichoopule leni teluginti pelli
varudu korina pelli raamayya pelli vadhuvu evaro kaadu seetamma tallee
aakaasa pandillu bhooloka sandallu sreerastu pellillu subhamastu noorellu

tummedalaade gummala jadalu hamsalu oode ammala nadalu
nagalaku kande maguvala medalu paduchu kallake gundela dadalu
aaraallamma kovela mundu pasupulaatato dhvajaarohanam
kalyannaniki ankuraarpanam padatulu katte pacchatoranam

indarintula cheyi sundarudee haayi talaku pose cheyi talapulokka veyi
nalugu pettina koddee aligindi vayasu vayasu aligina koddee veligindi manasu

magapelli vaarata eemani vaarata pelliki tarali vastunnaarata
coffeelu adagarata upmaalu eragarata veeriki saddanname ghanamou
veeri goppalu cheppa taramaa
band melaam adagarata dolu sannayi eragarata veeriki bhoga melaam ghanamou
veeri goppalu cheppa taramaa
magapelli vaarata eemani vaarata pelliki tarali vastunnaarata

immani katnam kori mem adagemledu ippatikaina F A B A cheppinchandi
chennapatnam stand addam kaavaalmaaku daaniki tagina pandiri mancham ippinchandi
kaanpooru kandla jodu kaavaalmaaku daaniki tagina wrist watch ippinchandi
immani katnam kori mem adagemledu ippatikaina F A B A cheppinchandi

nacche nacche accha girl friend ekkada
ye ekkada

adi labo dibo gabbo jabbo maariage love marriage
adi honey mon avvagaane damage
evariki vaare yamuna teere package toka peekeji
adi ato ito ayyindante daaredee krishna barrage

aakaasa pandillu bhooloka sandallu sreerastu pellillu subhamastu noorellu
aidurojula pelli ammanti pelli tolichoopule leni teluginti pelli
varudu korina pelli raamayya pelli vadhuvu evaro kaadu seetamma tallee

chedu kaadoyi tamalaaku mukka andulo veyyi siripoga sekka
sunnamesaavo nee noru pokka phakku mantaadi maa inti sukka
paccha karpoora taamboolamicchaaka ekka vacchoyi komalle pakka
panchukovacchu maa paala sukka pandukovacchu sai ante sukka
tellavaaraaka nee bugga sukka gumma kerakaala gurutaina lakka
kariginaa naa poddu ee bandhamallodo nindu noorelladee janta akka
ninnu deevinchina aada bidda ooru diviseemalo nandigedda
aada pantulla akshintaladda manchi sankunaala mee inta sedda
mammu kanipettu maa raasa bidda

tattalo koorchunda bettina vadhuvunaa gummadi puvvulo kulikenokati
adi manchu mutyamaa mana vadhuvu ratnamaa

ఐదురోజుల పెళ్లి అమ్మంటి పెళ్లీ తొలిచూపులే లేని తెలుగింటి పెళ్లీ
వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లీ వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లీ
ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు శ్రీరస్తు పెళ్లిళ్లు సుభమస్తు నూరేళ్లు

తుమ్మెదలాడె గుమ్మల జడలు హంసలు ఊడే అమ్మల నడలు
నగలకు కందే మగువల మెడలు పడుచు కళ్లకె గుండెల దడలు
ఆరాళ్లమ్మ కోవెల ముందు పసుపులాటతొ ధ్వజారోహనం
కళ్యణానికి అంకురార్పణం పడతులు కట్టె పచ్చతోరణం

ఇందరింతుల చేయి సుండరుడీ హాయి తలకు పోసె చేయి తలపులొక్క వేయి
నలుగు పెట్టిన కొద్దీ అలిగింది వయసు వయసు అలిగిన కొద్దీ వెలిగింది మనసు

మగపెళ్లి వారట ఈమని వారట పెళ్లికి తరలి వస్తున్నారట
కాఫీలు అడగరట ఉప్మాలు ఎరగరట వీరికి సద్దన్నమే ఘనమౌ
వీరి గోప్పలు చెప్ప తరమా
బాండ్ మేళాం అడగరట డోలు సన్నాయి ఎరగరట వీరికి భోగ మేళాం ఘనమౌ
వీరి గోప్పలు చెప్ప తరమా
మగపెళ్లి వారట ఈమని వారట పెళ్లి కి తరలి వస్తున్నారట

ఇమ్మని కట్నం కోరి మేం అడగేంలేదు ఇప్పటికైన ఎఫ్ ఎ బి ఎ చెప్పించండి
చెన్నపట్నం స్టాండ్ అద్దం కావాల్మాకు దానికి తగిన పందిరి మంచం ఇప్పించండి
కానుపూరు కండ్ల జోడు కావాల్మాకు దానికి తగిన వ్రిస్టు వాచ్ ఇప్పించండి
ఇమ్మని కట్నం కోరి మేం అడగేంలేదు ఇప్పటికైన ఎఫ్ ఎ బి ఎ చెప్పించండి

నచ్చె నచ్చె అచ్చ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ
యె ఎక్కడ

అది లబొ దిబొ గబ్బొ జబ్బొ మారేజి లవ్ మారేజి
అది హనీ మూన్ అవ్వగానె డామేజీ
ఎవరికి వారె యమునా తీరె పాకేజి తోక పీకేజి
అది అటొ ఇటొ అయ్యిందంటె దారెదీ కృష్ణ బారేజ్

ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు శ్రీరస్తు పెళ్లిళ్లు సుభమస్తు నూరేళ్లు
ఐదురోజుల పెళ్లి అమ్మంటి పెళ్లీ తొలిచూపులే లేని తెలుగింటి పెళ్లీ
వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లీ వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లీ

చేదు కాదోయి తమలాకు ముక్క అందులొ వెయ్యి సిరిపోగ సెక్క
సున్నమేసావొ నీ నోరు పొక్క ఫక్కు మంటాది మా ఇంటి సుక్క
పచ్చ కర్పూర తాంబూలమిచ్చాక ఎక్క వచ్చోయి కోమల్లె పక్క
పంచుకొవచ్చు మా పాల సుక్క పండుకోవచ్చు సై అంటె సుక్క
తెల్లవారాక నీ బుగ్గ సుక్క గుమ్మ కెరకాల గురుతైన లక్క
కరిగినా నా పొద్దు ఈ బంధమల్లొడొ నిండు నూరేల్లదీ జంట అక్క
నిన్ను దీవించిన ఆడ బిడ్డ ఊరు దివిసీమలో నందిగెడ్డ
ఆడ పంతుళ్ల అక్షింతలడ్డ మంచి శకునాల మీ ఇంట సెడ్డ
మమ్ము కనిపెట్టు మా రాస బిడ్డ

తట్టలొ కూర్చుండ బెట్టిన వధువునా గుమ్మడి పువ్వులొ కులికెనొకటీ
అది మంచు ముత్యమా మన వధువు రత్నమా

Saturday, April 21, 2012

7/G Brindhavan Colony - Talachi Talachi



Artist: Ravi Krishna, Sonia Agarwal
Year: 2004
Singer: Shreya Ghoshal
Music Director: Yuvan Shankar Raja
Lyricist: Siva Ganesh, A.M. Rathnam





talachi talachi chooste tarali dariki vastaa
neekai nenu bratikee untinee
neelo nannu choosukontinee
terachi choosi chaduvu vela
kaalipoye lekha raasaa
neekai nenu bratikee untinee
neelo nannu choosukontinee

koluvu teeru taruvula needa
cheppukonunu mana kathanepudu
raalipoyina poola gandhamaa
raaka telupu muvvala sadini
taluchukonunu daarulu epudu
pagilipoyina gaajula andamaa
aracheta vedini repe cheliya cheyi nee chenta
odilo vaali kadhalanu cheppa raasipettaledu
toli swapnam kaanule priyatamaa
kanulu teruvumaa

madhuramaina maatalu enno
kalasipovu nee palukulalo
jagamu karugu roope karugunaa
cherigiponi choopulu anni
reyi pagalu niluchunu neelo
needu choopu nannu marachunaa
venta vacchu needa bimbam vacchi vacchi povu
kalla mundu saakshyaalunna tirigi nenu vastaa
oka saari kaaduraa priyatamaa
epudoo pilichinaa

talachi talachi chooste tarali dariki vastaa
neekai nenu bratikee untinee
neelo nannu choosukontinee

తలచి తలచి చూస్తె తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికీ ఉంటినీ
నీలొ నన్ను చూసుకొంటినీ
తెరచి చూసి చదువు వేళ
కాలిపోయె లేఖ రాసా
నీకై నేను బ్రతికీ ఉంటినీ
నీలొ నన్ను చూసుకొంటినీ

కొలువు తీరు తరువుల నీడ
చెప్పుకొనును మన కథనెపుడు
రాలిపోయిన పూల గంధమా
రాక తెలుపు మువ్వల సడిని
తలుచుకొనును దారులు ఎపుడు
పగిలిపోయిన గాజుల అందమా
అరచేత వేడిని రేపె చెలియ చేయి నీ చెంత
ఒడిలొ వాలి కధలను చెప్ప రాసిపెట్టలేదు
తొలి స్వప్నం కానులె ప్రియతమా
కనులు తెరువుమా

మధురమైన మాటలు ఎన్నొ
కలసిపోవు నీ పలుకులలొ
జగము కరుగు రూపె కరుగునా
చెరిగిపోని చూపులు అన్ని
రేయి పగలు నిలుచును నీలొ
నీదు చూపు నన్ను మరచునా
వెంట వచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవు
కళ్ల ముందు సాక్ష్యాలున్న తిరిగి నేను వస్తా
ఒక సారి కాదురా ప్రియతమా
ఎపుడూ పిలిచినా

తలచి తలచి చూస్తె తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికీ ఉంటినీ
నీలొ నన్ను చూసుకొంటిని

7/G Brindhavan Colony - Idi Ranarangama


Artist: Ravi Krishna, Sonia Agarwal
Year: 2004
Singer: Harish Raghavendra
Music Director: Yuvan Shankar Raja
Lyricist: Siva Ganesh, A. M. Rathnam




idi ranarangamaa leka agnigundamaa
vidhi nadipe premaa ardhamavvade
idi ranarangamaa leka agnigundamaa
vidhi nadipe premaa ardhamavvade

agni kanamu neeti gunamu rentini kalipite nuvvena
ivatali vaipu devatavaite avatali vaipu deyyamva
samayam tintaav medadunu tintaav
nanne tintaav tappu kaadaa
pani paata leni pillaa intlo neeku tindi ledaa
choopulu tagalaga maatalu pegalaka
urumulu merupulu aarambham
paadam kesam naabhi kamalam ragulukonaga aanandam
dhaga dhagamani veligenu jwaala
sega segayani egirenu baala
taha tahamani tapanala gola
kasi kasiyani kougili ela

mitrula brundam edure vaste pakkaki tolagi nadichitini
podduta ninnu choostaanantu raatrinantaa gadipitini
ittaa ittaa rojulu gadavaga inkaa nannem chestaavu
maayaa mantram telisina daana twaragaa nannu champedavaa
e taadainaa nee talapulni bigiselaaga kadutundaa
nanne kaalchaga emukala goodu nee peregaa chebutundi
chitapatamani chindestaava vadulodulani vidilistaava
dadadadamani dadipistaava ontarigaa vadilestaava

idi ranarangamaa leka agnigundamaa
vidhi nadipe premaa ardhamavvade

ఇది రణరంగమా లేక అగ్నిగుండమా
విధి నడిపె ప్రేమా అర్ధమవ్వదె
ఇది రణరంగమా లేక అగ్నిగుండమా
విధి నడిపె ప్రేమా అర్ధమవ్వదె

అగ్ని కణము నీటి గుణము రెంటిని కలిపితె నువ్వేన
ఇవతలి వైపు దేవతవైతె అవతలి వైపు దెయ్యంవ
సమయం తింటావ్ మెదడును తింటావ్
నన్నె తింటావ్ తప్పు కాదా
పని పాట లేని పిల్లా ఇంట్లో నీకు తిండి లేదా
చూపులు తగలగ మాటలు పెగలక
ఉరుములు మెరుపులు ఆరంభం
పాదం కేశం నాభి కమలం రగులుకొనగ ఆనందం
ధగ ధగమని వెలిగెను జ్వాల
సెగ సెగయని ఎగిరెను బాల
తహ తహమని తపనల గోల
కసి కసియని కౌగిలి ఏల

మిత్రుల బృందం ఎదురే వస్తే పక్కకి తొలగి నడిచితిని
పొద్దుట నిన్ను చూస్తానంటు రాత్రినంతా గడిపితిని
ఇట్టా ఇట్టా రోజులు గడవగ ఇంకా నన్నేం చేస్తావు
మాయా మంత్రం తెలిసిన దాన త్వరగా నన్ను చంపెదవా
ఏ తాడైనా నీ తలపుల్ని బిగిసేలాగ కడుతుందా
నన్నె కాల్చగ ఎముకల గూడు నీ పేరేగా చెబుతుంది
చిటపటమని చిందేస్తావ వదులొదులని విదిలిస్తావ
దడదడమని దడిపిస్తావ ఒంటరిగా వదిలేస్తావ

ఇది రణరంగమా లేక అగ్నిగుండమా
విధి నడిపె ప్రేమా అర్ధమవ్వదె

Friday, April 20, 2012

Awaara - Chiru Chiru


Artist: Karthi Sivakumar, Tamannaah Bhatia
Year: 2010
Singers: Haricharan, Tanvi Shah
Music Director: Yuvan Shankar Raja
Lyricist: Chandrabose




chiru chiru chiru chinukai kurisaave
marukshanamuna marugai poyaave
nuvve prema baanam nuvve prema konam
puvvai navvagaane gaalai egirenu praanam
chey chey chelimini chey antoo hrudayam palikinade
sye sye sarasaku sye antoo paadam kadilinade
edane neeto ettukellaave

chiru chiru chiru chinukai kurisaave
marukshanamuna marugai poyaave

devataa tane oka devataa
mukhaamukhi andame choodaga aayuve chaaluna
gaalilo tane kada parimalam
cheli sakhi anumate adagaka puvvule pooyunaa
sigalo kurule meghaalalle aadevela
gundellona merupe merise choope maimarache
cheli chekkille muddultone tadimeyyaalaa
chengu chengu adugullona muvvai madi murise
edane tanato ettukellinde
chey chey chelimini chey antoo hrudayam palikinade
sye sye sarasaku sye antoo paadam kadilinade

todugaa prati kshanam veedakaa
anukshanam aameto saagana aame naa spandanaa
nelapai padeyyaka needane
chaka chaka cherana aapana gundelo cherchanaa
daaram badulu praayam tote kattesinde
gaayam leka kosesinde haayiga navvesinde
naalo nenu mounamgaane maataadeste
mottam taanu vintoovunde tiyyagaa vedhistunde
edane tanato ettukellinde
chey chey chelimini chey antoo hrudayam palikinade
sye sye sarasaku sye antoo paadam kadilinade

chiru chiru chiru chinukai kurisaave
marukshanamuna marugai poyaave
chiru chiru chiru chinukai kurisaave
marukshanamuna marugai poyaave

చిరు చిరు చిరు చినుకై కురిసావే
మరుక్షణమున మరుగై పోయావే
నువ్వే ప్రేమ బాణం నువ్వే ప్రేమ కోణం
పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం
చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హ్రుదయం పలికినదె
సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదె
ఎదనే నీతో ఎత్తుకెళ్లావె

చిరు చిరు చిరు చినుకై కురిసావే
మరుక్షణమున మరుగై పోయావే

దేవతా తనె ఒక దేవతా
ముఖాముఖి అందమే చూడగ ఆయువే చాలున
గాలిలో తనె కద పరిమళం
చెలి సఖి అనుమతే అడగక పువ్వులే పూయునా
సిగలో కురులే మేఘాలల్లె ఆడేవేళ
గుండెల్లోన మెరుపే మెరిసే చూపే మైమరచె
చెలి చెక్కిల్లె ముద్దుల్తోనె తడిమెయ్యాలా
చెంగు చెంగు అడుగుల్లోన మువ్వై మది మురిసే
ఎదనే తనతో ఎత్తుకెళ్లిందే
చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హ్రుదయం పలికినదె
సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదె

తోడుగా ప్రతి క్షణం వీడకా
అనుక్షణం ఆమెతో సాగన ఆమె నా స్పందనా
నేలపై పడెయ్యక నీడనే
చక చక చేరన ఆపన గుండెలొ చేర్చనా
దారం బదులు ప్రాయం తోటె కట్టేసిందె
గాయం లేక కోసేసిందే హాయిగ నవ్వేసిందే
నాలొ నేను మౌనంగానె మాటాడేస్తే
మొత్తం తాను వింటూవుందే తియ్యగా వేధిస్తుందే
ఎదనే తనతో ఎత్తుకెళ్లిందే
చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హ్రుదయం పలికినదె
సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదె

చిరు చిరు చిరు చినుకై కురిసావే
మరుక్షణమున మరుగై పోయావే
చిరు చిరు చిరు చినుకై కురిసావే
మరుక్షణమున మరుగై పోయావే

Thursday, April 19, 2012

Avunanna Kadanna - Gudigantala


Artist: Uday Kiran, Sadha
Year: 2005
Singers: S. P. B. Charan, Usha
Music Director: R. P. Patnaik
Lyricist: Kula Sekhar


gudigantalaa navvutaavelaa
teliyadu naaku teliyadu
jadagantalaa oogutaavelaa
teliyadu naaku teliyadu
asalenti sangati o baalaa
teliyadu teliyadu teliyadu teliyadule

gudigantalaa navvutaavelaa
teliyadu naaku teliyadu
jadagantalaa oogutaavelaa
teliyadu naaku teliyadu

neevaipalaa choostunte aakaleyakundi
nee choopulo bandhinche mantrame unnadi
nee maatale vintunte roju maarutundi
naa toduga nuvvunte swargame chinnadi
manasenduko ilaa moogabotondi raama
teliyadu
marmalle puvvula guppumantondi lona
teliyadu

gudigantalaa navvutaavelaa
teliyadu naaku teliyadu
jadagantalaa oogutaavelaa
teliyadu naaku teliyadu

nee nedalo nenunna choodamantunnadi
ee haayi peredaina kottagaa unnadi
naa kantine kaadanna ninnu choostunnadi
nenentagaa vaddanna ishtamantunnadi
mari deeninekada lokamantundi premaa
teliyadu
adi dooramantoone cheruvautundi raama
teliyadu

gudigantalaa navvutaavelaa
teliyadu naaku teliyadu
jadagantalaa oogutaavelaa
teliyadu naaku teliyadu
asalenti sangati o baalaa
teliyadu teliyadu teliyadu teliyadule

gudigantalaa navvutaavelaa
teliyadu naaku teliyadu
jadagantalaa oogutaavelaa
teliyadu

గుడిగంటలా నవ్వుతావేలా
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేలా
తెలియదు నాకు తెలియదు
అసలేంటి సంగతి ఓ బాలా
తెలియదు తెలియదు తెలియదు తెలియదులే

గుడిగంటలా నవ్వుతావేలా
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేలా
తెలియదు నాకు తెలియదు

నీవైపలా చూస్తుంటె ఆకలేయకుంది
నీ చూపులొ బంధించె మంత్రమె ఉన్నది
నీ మాటలె వింటుంటె రోజు మారుతుంది
నా తోడుగ నువ్వుంటె స్వర్గమె చిన్నది
మనసెందుకొ ఇలా మూగబోతోంది రామ
తెలియదు
మరుమల్లె పువ్వుల గుప్పుమంటోంది లోన
తెలియదు

గుడిగంటలా నవ్వుతావేలా
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేలా
తెలియదు నాకు తెలియదు

నీ నీడలొ నేనున్న చూడమంటున్నది
ఈ హాయి పేరేదైన కొత్తగా ఉన్నది
నా కంటినే కాదన్న నిన్ను చూస్తున్నది
నేనెంతగా వద్దన్న ఇష్టమంటున్నది
మరి దీనినేకద లోకమంటుంది ప్రేమా
తెలియదు
అది దూరమంటూనె చేరువౌతుంది రామ
తెలియదు

గుడిగంటలా నవ్వుతావేలా
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేలా
తెలియదు నాకు తెలియదు
అసలేంటి సంగతి ఓ బాలా
తెలియదు తెలియదు తెలియదు తెలియదులే

గుడిగంటలా నవ్వుతావేలా
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేలా
తెలియదు

Wednesday, April 18, 2012

Johnny - Ee Reyi Tiyyanidi


Artist: Pawan Kalyan, Renu Desai
Year: 2003
Singers: Hariharan, Nandita
Music Director: Ramana Gogula
Lyricist: Sirivennela Seetharama Shastry


ee reyi tiyyanidi ee chirugaali manasainadi
ee haayi maayindi intaku minchi emunnadi
evevo korikalu edalo jhummani antunnavi
aa konte mallikalu allana daagi vintunnavi

o varamula dorikeni parichayam
naa manasulo kurisene amrutam
naa niluvanaa alalaye paravasam
nee chelimike cheyanee ankitam
korukune teeramuga aagenu ee nimisham

evevo korikalu edalo jhummani antunnavi
aa konte mallikalu allana daagi vintunnavi

nee oopire vecchaga tagalani
naa nuditipai tilakamai velagani
naa choopule challaga taakani
nee pedavipai navvuga nilavani
aasalake aayuvuga maarenu nee sneham

ee reyi tiyyanidi ee chirugaali manasainadi
ee haayi maayindi intaku minchi emunnadi
intaku minchi emunnadi
intaku minchi emunnadi

ఈ రేయి తియ్యనిది ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది
ఏవేవొ కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి

ఓ వరముల దొరికెని పరిచయం
నా మనసులో కురిసెనే అమృతం
నా నిలువునా అలలయే పరవశం
నీ చెలిమికే చేయనీ అంకితం
కోరుకునే తీరముగ ఆగెను ఈ నిమిషం

ఏవేవొ కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి

నీ ఊపిరే వెచ్చగ తగలని
నా నుదిటిపై తిలకమై వెలగని
నా చూపులె చల్లగ తాకని
నీ పెదవిపై నవ్వుగ నిలవని
ఆశలకే ఆయువుగ మారెను నీ స్నేహం

ఈ రేయి తియ్యనిది ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది
ఇంతకు మించి ఏమున్నది
ఇంతకు మించి ఏమున్నది

Tuesday, April 17, 2012

Jalsa - My Heart Is Beating

Artist: Pawan Kalyan, Ileana D'Cruz, Parvati Melton
Year: 2008
Singer: KK
Music Director: Devi Sri Prasad
Lyricist: Sirivennela Seetharama Shastry



my heart is beating adolaa
telusukovaa adi
ennaallee waiting anelaa
tarumutondi madi
pedavipai palakade manasulo unna sangati
kanulalo vetikite dorukutundi

tea spoon tonnu baruvautunde
full moon nannu udikistunde
cloud nine kaalla kindakocchinde
land mine gundelo pelinde

my heart is beating adolaa
telusukovaa adi
ennaallee waiting anelaa
tarumutondi madi

hey i wanna be with you forever
hey i wanna live with you forever

penu toofaanu edaina merupu daadi chesinda
munupuleni maikaana madini munchi poyinda
oorikine peragaduga oopiri salapani bhaaramila
nee unike unnadiga naalo niluvella
talapulalo chorabadutu gajibijiga chelaregaala
talagadato talabadutu tellaarlu ontariga vegaala

cell phone nee kaburu testunte
stun gun moginattu untunde
crompton fanu gaali veestunte
cyclone taakinattu untunde

my heart is beating adolaa
telusukovaa adi
ennaallee waiting anelaa
tarumutondi madi

epudelaa tegistaano naa meede naaku anumaanam
maatallo paikanestaano nee meeda unna abhimaanam
twaratwaraga tariminade pada pada padamani paduchu radham
eda layalo mudirinade madhanudi chilipi rytham
gusagusaga pilichinade manasuna virisina kalala vanam
tahatahaga tariminade dammaru dammani toole aanandam

freedom dorikinattu gaalullo
welcome pilupu vinipistunde
baanam vesinattu e villo
praanam doosukelli potunde

my heart is beating adolaa
telusukovaa adi
ennaallee waiting anelaa
tarumutondi madi

మై హార్ట్ ఇస్ బీటింగ్ అదోలా
తెలుసుకోవా అది
ఎన్నాళ్లీ వెయ్టింగ్ అనేలా
తరుముతోంది మది
పెదవిపై పలకదే మనసులొ ఉన్న సంగతి
కనులలో వెతికితే దొరుకుతుంది

టీ స్పూన్ టన్ను బరువౌతుందె
ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే
క్లౌడ్ నైన్ కాళ్ల కిందకొచ్చిందె
లాండ్ మైన్ గుండెలొ పేలిందె

మై హార్ట్ ఇస్ బీటింగ్ అదోలా
తెలుసుకోవా అది
ఎన్నాళ్లీ వెయ్టింగ్ అనేలా
తరుముతోంది మదీ

హేయ్ ఐ వాన్న బి విత్ యు ఫారెవర్
హేయ్ ఐ వాన్న లివ్ విత్ యు ఫారెవర్

పెను తుఫాను ఏదైన మెరుపు దాడి చేసింద
మునుపులేని మైకాన మదిని ముంచి పోయిందా
ఊరికినె పెరగదుగ ఊపిరి సలపని భారమిల
నీ ఉనికె ఉన్నదిగ నాలొ నిలువెల్ల
తలపులలొ చొరబడుతు గజిబిజిగ చెలరేగాల
తలగడతొ తలబడుతు తెల్లార్లు ఒంటరిగ వేగాల

సెల్ ఫోన్ నీ కబురు తెస్తుంటె
స్టన్ గన్ మోగినట్టు ఉంటుందె
క్రాంప్టన్ ఫాను గాలి వీస్తుంటె
సైక్లోన్ తాకినట్టు ఉంటుందె

మై హార్ట్ ఇస్ బీటింగ్ అదోలా
తెలుసుకోవా అది
ఎన్నాళ్లీ వెయ్టింగ్ అనేలా
తరుముతోంది మదీ

ఎపుడెలా తెగిస్తానొ నా మీదె నాకు అనుమానం
మాటల్లొ పైకనేస్తానొ నీ మీద ఉన్న అభిమానం
త్వరత్వరగ తరిమినదె పద పద పదమని పడుచు రధం
ఎద లయలొ ముదిరినదె మధనుడి చిలిపి రిథం
గుసగుసగ పిలిచినదె మనసున విరిసిన కలల వనం
తహతహగ తరిమినదె దమ్మరు దమ్మని తూలె ఆనందం

ఫ్రీడం దొరికినట్టు గాలుల్లొ
వెల్కం పిలుపు వినిపిస్తుందె
బాణం వేసినట్టు ఏ విల్లొ
ప్రాణం దూసుకెళ్లి పోతుందె

మై హార్ట్ ఇస్ బీటింగ్ అదోలా
తెలుసుకోవా అది
ఎన్నాళ్లీ వెయ్టింగ్ అనేలా
తరుముతోంది మదీ

Sunday, April 15, 2012

Maryada Ramanna - Ammayi

Artist: Sunil, Saloni Aswani
Year: 2010
Singers: Chaitra, N. C. Karunya
Music Director: M. M. Keeravani
Lyricist: Anantha Sreeram


ammaayi kitiki pakkana koorchundi
kitikeelonchem kanabadutundi
gantaki debbai mailla vegamtoti
ee lokam parigedutundandi

ammaayi kitiki pakkana koorchundi
kitikeelonchem kanabadutundi
gantaki debbai mailla vegamtoti
ee lokam parigedutundandi

akkada choodu taadi chettundi
aakulu oopi taata chebutundi
jaabili enduku vente vastundi
nee paina manasaiyuntundi
paiki kindaki ooge nela emandi
nuvvu oo antene ooyyaalavutaanandi
meediki vachche gaalemanukuntundi
nee oosulu moyyaalantundi

ammaayi gummam daggara nunchundi
gummamlonchem kanabadutundi
gantaki enabhai mailla vegamtoti
evevo aalochistundi

oohinchani majili vacchindi
naalo oohalni malupulu tippindi
ippati varaku eragani santoshaanni
itte naa mundara unchindi
challati cheekati chuttu kammuku vastundi
vecchati chalimantaki aa cheekati karigindi
nidduralone kavvinche kala kanna
nijamento andanga undi

ammaayi kitiki pakkana padukundi
kitikilonchem kanabadutundi
gantaki tombhai mailla vegamtoti
kunukocchi vaalipoyindi

అమ్మాయి కిటికి పక్కన కూర్చుంది
కిటికీలోంచేం కనబడుతుంది
గంటకి డెబ్బై మైళ్ల వేగంతోటి
ఈ లోకం పరిగెడుతుందండి

అమ్మాయి కిటికి పక్కన కూర్చుంది
కిటికీలోంచేం కనబడుతుంది
గంటకి డెబ్బై మైళ్ల వేగంతోటి
ఈ లోకం పరిగెడుతుందండి

అక్కడ చూడు తాడి చెట్టుంది
ఆకులు ఊపి టాట చెబుతుంది
జాబిలి ఎందుకు వెంటె వస్తుంది
నీ పైన మనసైయుంటుంది
పైకి కిందకి ఊగే నేల ఏమంది
నువ్వు ఊ అంటేనె ఊయ్యాలవుతానంది
మీదికి వచ్చె గాలేమనుకుంటుంది
నీ ఊసులు మొయ్యాలంటుంది

అమ్మాయి గుమ్మం దగ్గర నుంచుంది
గుమ్మంలోంచేం కనబడుతుంది
గంటకి ఎనభై మైళ్ల వేగంతోటి
ఏవేవో ఆలోచిస్తుంది

ఊహించని మజిలి వచ్చింది
నాలొ ఊహల్ని మలుపులు తిప్పింది
ఇప్పటి వరకు ఎరగని సంతోషాన్ని
ఇట్టె నా ముందర ఉంచింది
చల్లటి చీకటి చుట్టు కమ్ముకు వస్తుంది
వెచ్చటి చలిమంటకి ఆ చీకటి కరిగింది
నిద్దురలోనె కవ్వించె కల కన్న
నిజమెంతొ అందంగ ఉంది

అమ్మాయి కిటికి పక్కన పడుకుంది
కిటికిలోంచేం కనబడుతుంది
గంటకి తొంభై మైళ్ల వేగంతోటి
కునుకొచ్చి వాలిపోయింది