Pages

Saturday, March 23, 2013

Aakali Rajyam - Gussa Rangayya


Artist: Kamal Haasan, Sridevi Kapoor
Year: 1981
Singer: P. Susheela
Music Director: M. S. Viswanathan
Lyricist: Acharya Aatreya


gussa rangayya koncham taggayya
kopam manishiki eggayya
gussa rangayya koncham taggayya
kopam manishiki eggayya

ee lokam maaredi kaadu
ee sokaalu teerevi kaavu
ee lokam maaredi kaadu
ee sokaalu teerevi kaavu
dora paakaana unnaanu nenu
kotta lokaanni naalona choodu

gussa rangayya koncham taggayya
kopam manishiki eggayya

desaanni docheti aasaamulunnaaroo
devunni digamingu poojaarulunnaaroo
praanaalato aadu vyaapaarulunnaaroo
manishiki manchiki samaadhi kattaaru
mahaatmulendaru sahaaya padina manchi jaragaledu
mahaatmulendaru sahaaya padina manchi jaragaledu
jaati vaidyule kota kosina neeti bratakaledu
bhogaalu vetukaadu vayasu
anuraagaala jati paadu manasu
nee daahaanikanuvaina sogasu
nee sontaanni chestundi paduchu

gussa rangayya koncham taggayya
kopam manishiki eggayya

kaatukettina kallalo kaipulunnavee
mallelettina kurulalo maapulunnavee
vanne terina kannelo chinnelunnavee
anni neeve anutaku rujuvulunnavi
chakkani chukka sarasanundaga pakka choopulelaa
chakkani chukka sarasanundaga pakka choopulelaa
baagupadani ee lokam kosam baadhapadedelaa
mohaanni repindi reyi
mana snehamlo undoyi haayi
ee andaanikandivvu cheyi
aanandaala bandhaalu veyi

gussa rangayya koncham taggayya
kopam manishiki eggayya

గుస్స రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్య
గుస్స రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్య

ఈ లోకం మారేది కాదు
ఈ శోకాలు తీరేవి కావు
ఈ లోకం మారేది కాదు
ఈ శోకాలు తీరేవి కావు
దోర పాకాన ఉన్నాను నేను
కొత్త లోకాన్ని నాలోన చూడు

గుస్స రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్య

దేశాన్ని దోచేటి ఆసాములున్నారూ
దేవున్ని దిగమింగు పూజారులున్నారూ
ప్రాణాలతొ ఆడు వ్యాపారులున్నారూ
మనిషికి మంచికి సమాధి కట్టారు
మహాత్ములెందరు సహాయ పడిన మంచి జరగలేదు
మహాత్ములెందరు సహాయ పడిన మంచి జరగలేదు
జాతి వైద్యులె కోత కోసిన నీతి బ్రతకలేదు
భోగాలు వెతుకాడు వయసు
అనురాగాల జతి పాడు మనసు
నీ దాహానికనువైన సొగసు
నీ సొంతాన్ని చేస్తుంది పడుచు

గుస్స రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్య

కాటుకెట్టిన కళ్ళలొ కైపులున్నవీ
మల్లెలెట్టిన కురులలొ మాపులున్నవీ
వన్నె తేరిన కన్నెలొ చిన్నెలున్నవీ
అన్ని నీవె అనుటకు ఋజువులున్నవి
చక్కని చుక్క సరసనుండగ పక్క చూపులేలా
చక్కని చుక్క సరసనుండగ పక్క చూపులేలా
బాగుపడని ఈ లోకం కోసం బాధపడేదేలా
మోహాన్ని రేపింది రేయి
మన స్నేహంలొ ఉందోయి హాయి
ఈ అందానికందివ్వు చేయి
ఆనందాల బంధాలు వేయి

గుస్స రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్య

0 comments:

Post a Comment