Tuesday, July 12, 2011
Swarna Kamalam - Andela Ravamidi
Artist: Venkatesh, Bhanupriya
Year: 1988
Singers: S. P. Balasubrahmanyam, Vani Jayaram
Music Director: Ilaiyaraaja
Lyricist: Sirivennela Seetharama Shastry
guru brahma guru vishnu guru devo maheswaraha
guru saakshaat parabrahma guru saakshaat parabrahma
tasmai sree gurave namah
om namo namo namasivaaya
mangalapradaaya gopurangate namasivaaya
gangayaatarangitottamaangate namasivaaya
om namo namo namasivaayasooline namo namah kapaaline namasivaaya
paaline viranchitunda maaline namasivaaya
andela ravamidi padamuladaa
andela ravamidi padamuladaa ambaramantina hrudayamudaa
andela ravamidi padamuladaa ambaramantina hrudayamudaa
amruta gaanamidi pedavuladaa amitaanandapu yada sadidaa
aagina saadhana saardhakamandaga yoga balamuga yaaga phalamuga
aagina saadhana saardhakamandaga yoga balamuga yaaga phalamuga
bratuku pranavamai mrogukadaa
andela ravamidi padamuladaa
muvvalu urumula savvadulai melikalu merupula melakuvalai
muvvalu urumula savvadulai melikalu merupula melakuvalai
menu harsha varsha meghamai meni visuru vaayu vegamai
hanga bhangimalu ganga pongulai haava bhaavamulu ningi rangulai
laasyamsaage leela rasajharulu jaaluvaarela
jangamamai jada paadaga jalapata geetamula toduga
parvataalu prasarinchina pacchani prakruti aakruti paarvati kaaga
andela ravamidi padamuladaa
nayana tejame nakaaramai
manonischayam makaaramai
swaasa chalaname shikaaramai
vaanchitaardhame vakaaramai
yochana sakalamu yakaaramai
naadham nakaaram mantram makaaram stotram Shikaaram vedam vakaaram yagnam yakaaram
om namasivaaya
bhaavame mounapu bhaavyamu kaadaa
bharatame niratamu bhaagyamu kaadaa
purila girulu tarigela taaandavamaade vela
praana panchamame panchaakshariga parama padamu prakatinchagaa
khagolaalu padakinkunulai padi dikkula dhoorjati aarbhati regaa
andela ravamidi padamuladaa ambaramantina hrudayamudaa
amruta gaanamidi pedavuladaa amitaanandapu yada sadidaa
andela ravamidi padamuladaa
గురు బ్రహ్మ గురు విష్ను గురు దేవో మహేశ్వరహ
గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
ఓం నమో నమో నమశ్శివాయ
మంగళప్రదాయ గోపురంగతె నమశ్శివాయ
గంగయాతరంగితోత్తమాంగతె నమశ్శివాయ
ఓం నమో నమో నమశ్శివాయ
శూలినె నమో నమః కపాలినె నమశ్శివాయ
పాలినే విరంచితుండ మాలినె నమశ్శివాయ
అందెల రవమిది పదములదా
అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా
అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా అమితానందపు యద సడిదా
ఆగిన సాధన సార్ధకమందగ యోగ బలముగ యాగ ఫలముగ
ఆగిన సాధన సార్ధకమందగ యోగ బలముగ యాగ ఫలముగ
బ్రతుకు ప్రణవమై మ్రోగుకదా
అందెల రవమిది పదములదా
మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై
మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై
మేను హర్ష వర్ష మేఘమై మేని విసురు వాయు వేగమై
హంగ భంగిమలు గంగ పొంగులై హావ భావములు నింగి రంగులై
లాస్యంసాగే లీల రసఝరులు జాలువారేల
జంగమమై జడ పాడగ జలపాత గీతముల తోడుగ
పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగ
అందెల రవమిది పదములదా
నయన తేజమే నకారమై
మనోనిశ్చయం మకారమై
శ్వాస చలనమే శికారమై
వాంచితార్ధమె వకారమై
యోచన సకలము యకారమై
నాధం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం
ఓం నమశ్శివాయ
భావమె మౌనపు భావ్యము కాదా
భరతమె నిరతము భాగ్యము కాదా
పురిల గిరులు తరిగేల తాండవమాడె వేల
ప్రాణ పంచమమె పంచాక్షరిగ పరమ పదము ప్రకటించగా
ఖగోలాలు పదకింకునులై పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా
అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా అమితానందపు యద సడిదా
అందెల రవమిది పదములదా
Subscribe to:
Post Comments (Atom)
10 comments:
ఆగిన సాధన లేకా సాగిన సాధన ..>?? పురిల గిరులు తరిగేల కాదు "తుహిన గిరులు కరిగేలా , తాండవమాడే వేళ" . ఈ రొజుల్లొ చలా మందికి 'ళ','ణ' పలకడానికి నాలిక తిరగదు. కనీసం వ్రాయడానికి కూడా చెయ్యితిరగకపొతే ఎలా.
భావమే భవునకు భావ్యము కాగా...మౌనపు కాదు...
It is not Purina girulu it is thuhina girulu that means hills covered by snow. Pl correct it.
అంగ భంగిమలు
భావమె భవునకు
Absolutely fabulous lyrics !! Thank You so much admin
Thank you for making the effort to write this. Unfortunately, there are many mistakes still. Will correct soon.
challani churaka tagilincharu
Saagina saadhana
Doorjati arbati rega ante meaning telupagalaru..
ఓ కవిసార్వభౌమ ఇది కల నిజమా..
అక్షరం ఆకాశనీకేగిసిందా ...
సాహిత్యం తుదిశ్వాస విడిచిందా...
గేయానికి గాయమయ్యి పోయిందా...
కవిత్వం కనుమరుగయ్యిందా..
తెలుగుపాట కన్నీటితో తడిసిందా..
భావ కవిత బద్దలయిపోయిందా...
మంచి మాట మట్టిలో కలిసిందా...
మీ పాటతో నిగ్గదీసి అడిగేస్తావ్ ఎలాంటి నిజానైనా....
మీ పాటతో జాబిలమ్మకే జోలపాడేస్తావ్...
జగమంత కుటుంబానికి పెద్ద దిక్కులా మారి మాలో దైర్యంనింపెస్తావ్..
అడుగు తడపడుతుంటే,ఆలోచనలో మేముంటే.... మీ పదాల మంత్రాలు మము దరి చేర్చే సూత్రాలు...
సిరివెన్నెల గారు.....మీరు ఎప్పుడు మా మనస్సు నుండి పోరు..
Post a Comment